హైదరాబాద్ శ్రీ హనుమాన్ దేవాలయ ప్రాంగణంలో కొలువైన శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి ఆలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా జ్వాల తోరణం అద్భుతంగా నిర్వహించారు ఆలయ అర్చకులు శ్రీ రిపుంజయ శర్మ నేతృత్వంలో ఈ కార్యక్రమం భక్తుల కోలాహలం మధ్య సాగింది ఆలయ అర్చకులు మాట్లాడుతూ హాలాహల ఘట్టం సముద్ర మథనంలో పుట్టిన హాలాహలాన్ని శివుడు కంఠంలో నిలిపినప్పుడు, స్వామికి ప్రమాదం కలగకూడదని పార్వతీ దేవి మ్రొక్కుకున్న సందర్భంలో ఈ ఆచారం మొదలైందని పురాణ కథనం.
త్రిపురాసుర సంహారం:
త్రిపురాసురులను సంహరించిన శివుడికి దిష్టి తగలకూడదని పార్వతీ దేవి ఈ జ్వాలా తోరణాన్ని ఏర్పాటు చేసిందని శివపురాణం చెబుతోంది. ఈ జ్వాలల కింద నుంచి వెళ్లడం వల్ల పాపాలు, చెడు ఆలోచనలు తొలగి, సన్మార్గం కలుగుతుందని భక్తుల నమ్మకం. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో సత్యనారాయణ నాయుడు అధికారి శ్రీనివాస్ గౌడ్ రవీంద్ర చార్యులు పాల్గొన్నారు.
కామెంట్లు (0)
కామెంట్ చేయడానికి లాగిన్ అవ్వండి
లాగిన్ఇంకా కామెంట్లు లేవు. మొదటి వ్యాఖ్య మీరే రాయండి!