కార్తీక మాసం ఉత్సవాల్లో భాగంగా శ్రీ సనత్ నగర్ మల్లికార్జునస్వామి ఆలయంలో ప్రతి నిత్యం స్వామివారికి తెల్లవారు జామునుంచి ప్రత్యేక అభిషేకాలు అంతరం స్వామివారి అలంకరణ దర్శనము ఉంటుంది ఈ రోజు గురువారం పదవ రోజు (కార్తీక శుద్ధ దశమి). హరిహరులకు ఎంతో ప్రీతికరమైన ఈ పర్వదినాన స్వామివారికి ప్రాతఃకాల అభిషేక అనంతరం స్వామివారికి వివిధ రకాల పువ్వులతో అలంకరణ అనంతరం దర్శనం సాయంకాలం ఆకాశ దీపారాధన కార్యక్రమం ఉంటుంది అని ఆలయ అర్చకులు శ్రీ రిపుంజయ శర్మ తెలిపారు ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో అధికారి భక్తులు పాల్గొన్నారు