ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో వేంకటేశ్వరస్వామికి వర్ధమాన్ జైన్ దంపతులు అందించిన బంగారు ఆభరణాల వివరాలు అందించారు. రూ.207.6 కోట్ల విలువైన 121 కేజీల బంగారు ఆభరణాలను శ్రీవారికి సమర్పించారు. 


బంగారు ఆభ‌ర‌ణాల వివ‌రాలు ఇవే..


•    శ్రీవారి కోసం 46 రకాల వేర్వేరు బంగారు ఆభరణాలను తయారు చేయించి కానుకగా అందించారు
•    శ్రీవారి ఆభరణాలుగా 106 కిలోల బంగారం
•    శ్రీ పద్మావతీ అమ్మవారికి 15 కేజీల బరువైన వస్త్రం
•    బంగారు పాద కవచములు -3
•    బంగారు అందెలు -3
•    బంగారు పాకడాలు
•    బంగారు తులసిపాత్ర హారం
•    బంగారు అష్టోత్తర కాసుల మాల
•    బంగారు చతుర్భుజ లక్ష్మీ హారం
•    బంగారు పులిగోరు
•    బంగారు అశ్వథ పాత్ర హారము
•    బంగారు సాదా వడ్డాణము
•    బంగారు గంటల మొలతాడు
•    బంగారు సూర్యకటారి
•    బంగారు కౌస్తుభం
•    బంగారు శ్రీవత్సం
•    బంగారు మోచేయి
•    బంగారు కటి హస్తం
•    బంగారు నాగాభరణ వడ్డాణము
•    బంగారు గోపు
•    బంగారు ఐదు పేటల కంఠీలు 5
•    బంగారు చంద్రవంకీ కంఠీ
•    బంగారు వైకుంఠ హస్తము
•    బంగారు కటి హస్తము
•    బంగారు నాగాభరణ కడియాలు 4
•    బంగారు భుజ కీర్తులు 3
•    బంగారు కర్ణపత్రములు 3
•    బంగారు భావళీలు -3 
•    బంగారు సాలిగ్రామ హారములు- 3
•    బంగారు కమలం తరహా సాలిగ్రామాలు 3
•    బంగారు మోపుగల యజ్ఞోపవీతం 
•    బంగారు శంఖ కవచము
•    బంగారు చక్ర కవచము
•    బంగారు కిటీపు ముఖపట్టి
•    బంగారు కిరీటము
•    2,427 కేరట్ల బరువున్న నీలాలు, పుష్యరాగం, కెంపులు, పచ్చలతో శ్రీవత్సం పతకం
•    238.2 కేరట్ల బరువున్న వజ్రాలను పొదిగిన ఆభరణాలు