బెల్లంపల్లి జిల్లా కాసిపేట మండలం తాటిగూడలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంపై ప్రత్యేక గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచి మడావి వెంకటేష్, మండల ప్రత్యేక అధికారి రాజేశ్వరి, ఎంపీడీవో సత్యనారాయణ సింగ్ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించారు. అర్హులైన పేద కుటుంబాలు పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సర్పంచి కోరారు. కార్యక్రమంలో ఎంపీఓ, ప్రజాప్రతినిధులు, పంచాయతీ కార్యదర్శులు, గ్రామస్తులు పాల్గొన్నారు.