Warangal: అర్హులైన ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా భరోసా కల్పించే లక్ష్యంతో చేపట్టిన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం నమోదు ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ (GWMC) కమిషనర్ టి. వెంకన్న అధికారులను ఆదేశించారు. 22వ డివిజన్ ఉర్సు కమ్యూనిటీ హాల్‌లో ఏర్పాటు చేసిన లబ్ధిదారుల నమోదు శిబిరాన్ని ఆయన పరిశీలించారు. అర్హులైన ప్రతి కుటుంబాన్ని గుర్తించి నమోదు చేయాలని, ఎవరూ మిగిలిపోకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. అర్హులైన కుటుంబాలన్నీ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని బీమా పథకంలో నమోదు చేసుకోవాలని కమిషనర్ కోరారు.