దేశంలోని పేద కుటుంబాలకు ఆహార భద్రత కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ‘ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన’ పథకంలో భారీ స్థాయిలో అనర్హులు లబ్ధి పొందుతున్నట్లు వెల్లడైంది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా రేషన్ కార్డుల జాబితా నుండి అనర్హులను ఏరివేసేందుకు (ప్రక్షాళనకు) కేంద్రం సిద్ధమవుతోంది. కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ విభాగం (DFPD) 2025-26 ఆర్థిక సంవత్సరంలో దేశంలోని 36 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 51,303 లబ్ధిదారుల కుటుంబాలపై నిర్వహించిన మూల్యాంకన అధ్యయనంలో ఈ సంచలన విషయాలు బయటపడ్డాయి.
13.2 శాతం ఇన్క్లూజన్ ఎర్రర్ (అనర్హులు)
ఈ పథకం కింద దేశవ్యాప్తంగా సుమారు 81.35 కోట్ల మందికి ఉచితంగా ఆహార ధాన్యాలు అందుతుండగా, అందులో 13.2 శాతం 'ఇన్క్లూజన్ ఎర్రర్' ఉన్నట్లు అధ్యయనం తేల్చింది. అంటే, ప్రభుత్వ నిబంధనల ప్రకారం అనర్హులైన కుటుంబాలు కూడా రేషన్ కార్డుల ద్వారా ఉచిత బియ్యం, గోధుమలు పొందుతున్నాయి.
ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్న కుటుంబాలు, సొంత కార్లు కలిగిన యజమానులు ఉచిత రేషన్ తీసుకుంటున్నట్లు గుర్తించారు.
ఇళ్లలో ఏసీలు (Air Conditioners) వినియోగిస్తున్న వారు, మూడు లేదా అంతకంటే ఎక్కువ గదుల పక్కా ఇళ్లు ఉన్నవారు కూడా ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నట్లు వెల్లడైంది.
కామెంట్లు (0)
కామెంట్ చేయడానికి లాగిన్ అవ్వండి
లాగిన్ఇంకా కామెంట్లు లేవు. మొదటి వ్యాఖ్య మీరే రాయండి!