నర్సంపేట: నర్సంపేట మున్సిపల్ పరిధిలోని 3వ వార్డు కమలాపురంలో శ్రీ వెంకటేశ్వర రైతు సంఘం (FPO) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రాన్ని చైర్ పర్సన్ పెండెం శ్రీలక్ష్మీరామానంద్ హాజరై ప్రారంభించారు. చైర్ పర్సన్ మాట్లాడుతూ.. రైతులు దళారుల చేతిలో మోసపోకుండా కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యాన్ని విక్రయించి, కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అందిస్తున్న మద్దతు ధరను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కేంద్రాల వద్ద రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిర్వాహకులు తగిన వసతులు కల్పించాలని ఆదేశించారు. రైతులకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని ఆమె భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ ముత్తినేని వెంకన్న, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు పంబి వంశీకృష్ణ, జిల్లా అధికార ప్రతినిధి ఎర్ర యాకూబ్ రెడ్డి, 3వ వార్డు అధ్యక్షుడు కంచు రవి, మాజీ ఎంపీటీసీ కాట ప్రభాకర్, పట్టణ కోశాధికారి లోడే రాజు, నాయకులు పూజారి సారంగం గౌడ్, లోడే చిన్న రాజు, అల్లంశెట్టి సోమన్న, వింతల రామ్ రెడ్డి, గొర్రె నవీన్, బత్తిని సాంబయ్య, గాదెగోని రాజన్న, కాట రాహుల్, బైకాని రాకేష్, FPO ప్రతినిధులు, స్థానిక రైతులు తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
రైతుల సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం పెద్దపీట..
© ముందడుగు. అనుమతి లేకుండా ఈ కథనాన్ని పునఃప్రచురించరాదు.
కామెంట్లు (0)
కామెంట్ చేయడానికి లాగిన్ అవ్వండి
లాగిన్ఇంకా కామెంట్లు లేవు. మొదటి వ్యాఖ్య మీరే రాయండి!