హైదరాబాద్ నగర శివారులోని మొయినాబాద్ ప్రాంతంలో శనివారం నవంబర్ 21 పాఠశాల విహారయాత్ర తీవ్ర విషాదంగా ముగిసింది. నార్సింగిలోని ఒక ప్రైవేట్ పాఠశాలకు చెందిన విద్యార్థులను మొయినాబాద్‌లోని గురుకుల పాఠశాల సమీపంలో ఉన్న లోటస్ పాండ్ పార్క్‌కు విహారయాత్రకు తీసుకువెళ్లారు. ఈ క్రమంలో జరిగిన ప్రమాదంలో టి. అభిరామ్ (10) అనే 4వ తరగతి విద్యార్థి ప్రాణాలు కోల్పోగా, టి. యశ్వంత్ (11) అనే మరో విద్యార్థి గాయపడ్డాడు.

ఈ ప్రమాదంలో అభిరామ్ ముఖం, నడుము భాగాల్లో తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఇద్దరు విద్యార్థులను సమీపంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే అభిరామ్ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. యశ్వంత్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లాకు చెందిన అభిరామ్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా జనరల్ ఆసుపత్రికి తరలించారు. పాఠశాల యాజమాన్యం సరైన భద్రతా చర్యలు, పర్యవేక్షణ లేకుండా పిల్లలను వదిలేయడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని మృతుడి తండ్రి ఆరోపించారు. ఘటనపై మొయినాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు