ఢిల్లీ: పుట్టిన తేదీ నిర్ధారణకు ఆధార్ కార్డును ఒక్కటే ప్రామాణికంగా, తుది రుజువుగా పరిగణించలేమని ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఉద్యోగిని పుట్టిన తేదీ విషయంలో తలెత్తిన వివాదంపై విచారణ జరిపిన ధర్మాసనం ఈ మేరకు స్పష్టతనిచ్చింది. రోసమ్మా జాయ్ అనే మహిళను పదవీ విరమణ వయసు పూర్తయిందంటూ ఆమె పనిచేస్తున్న సంస్థ ఏడాది ముందే ఉద్యోగం నుంచి తొలగించింది. అయితే, ఈఎస్‌ఐసీ రికార్డుల్లో యాజమాన్యమే ఆమె పుట్టిన తేదీని 1960 మే 20గా నమోదు చేయగా, ఆధార్ కార్డులో 1959 మే 20గా ఉంది.కేవలం ఆధార్ కార్డులోని తేదీని ఆధారంగా చేసుకుని ఆమెను ముందుగానే రిటైర్ చేయడం చెల్లదని హైకోర్టు తేల్చిచెప్పింది. యాజమాన్యం దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసిన కోర్టు, సదరు మహిళకు రావాల్సిన మిగిలిన బకాయిలన్నింటినీ నాలుగు వారాల్లోగా చెల్లించాలని ఆదేశించింది.
వార్తలు
పుట్టిన తేదీ నిర్ధారణకు ఆధార్ కార్డు రుజువు కాదు
క్రెడిట్: విక్రమ్ శ్రీరాముల
© ముందడుగు. అనుమతి లేకుండా ఈ కథనాన్ని పునఃప్రచురించరాదు.
కామెంట్లు (0)
కామెంట్ చేయడానికి లాగిన్ అవ్వండి
లాగిన్ఇంకా కామెంట్లు లేవు. మొదటి వ్యాఖ్య మీరే రాయండి!