వరంగల్:

హైదరాబాద్‌లోని ఐటీసీ కాకతీయ హోటల్‌లో నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో అశోక్ నగర్ సర్పంచ్ జాడి అచ్యుతంకు అరుదైన గుర్తింపు లభించింది. పునరుత్పాదక ఇంధనం, వృత్తాకార ఆర్థిక వ్యవస్థ అంశాలపై తన అభిప్రాయాలను వివరించారు. ముఖ్యంగా గ్రామపంచాయతీల అభివృద్ధిలో భాగంగా సోలార్ వీధి దీపాల ఏర్పాటు, పునరుత్పాదక ఇంధన వినియోగం, గ్రామపంచాయతీల మౌలిక సదుపాయాల మెరుగుదల తదితర అంశాలపై తన అనుభవాలను పంచుకున్నారు.

ఢిల్లీలో నిర్వహించనున్న గ్లోబల్ సమ్మిట్‌లో ఎల్‌నినో ప్రభావాలను ఎదుర్కొనేందుకు తెలంగాణ రాష్ట్రం రూపొందించిన కార్యాచరణ ప్రణాళికను రాష్ట్రం తరఫున వివరించనున్నారు.

గ్రామస్థాయిలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన అంశాలపై ఆయన చూపుతున్న చొరవను గుర్తించిన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జాడి అచ్యుతంను అభినందించారు. అశోక్‌నగర్ గ్రామపంచాయతీకి, ఖానాపూర్ మండలానికి, తెలంగాణ రాష్ట్రానికి గుర్తింపు తీసుకురావడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు.