ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్న పాదయాత్రలో కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఫహీం ఖురేషి పాల్గొన్నారు. ఇందిరా చౌరస్తా నుంచి నాగదేవత జంక్షన్ సమీపంలోని బహిరంగ సభ ప్రాంగణం వరకు సీఎం వెంట పాదయాత్రలో నడిచారు. ఈ సందర్భంగా సీఎం రూ.5 లక్షల బీమా కవరేజీతో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ప్రారంభించడంతో పాటు విద్య, మౌలిక వసతులు, పౌర సదుపాయాలకు సంబంధించి రూ.544 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, మంత్రులు వివేక్ వెంకటస్వామి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, దామోదర రాజనర్సింహ, ఎంపీ అనిల్ యాదవ్, ప్రభుత్వ విప్‌లు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు.

.