కార్తీక మాసాన్ని పురస్కరించుకొని కాలనీకి చెందిన స్నేహితులందరూ కలిసి భక్తి, సేవాభావంతో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా స్నేహితులంతా తమ ఇళ్లలో స్వయంగా వివిధ రకాల అల్పాహార వంటకాలను తయారు చేశారు. అనంతరం వాటిని హనుమాన్ దేవలయం తీసుకెళ్లి స్వామివారి దర్శనానికి విచ్చేసిన భక్తులకు అయ్యప్ప మాల దారులకు ఉచితంగా పంపిణీ చేశారు.
స్వయంగా వంటలు తయారు చేసి భక్తులకు అల్పాహారం అందించడం పట్ల భక్తులు హర్షం వ్యక్తం చేశారు. కార్తీక మాసంలో సేవా కార్యక్రమం నిర్వహించడం ఎంతో సంతృప్తినిచ్చిందని కాలనీ స్నేహితులు తెలిపారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు సమాజంలో ఐక్యత, స్నేహభావం, ఆధ్యాత్మిక చింతనను పెంపొందిస్తాయని వారు పేర్కొన్నారు.
అధ్యాత్మికం
కార్తీక మాసం భక్తులకు అల్పాహార పంపిణీ
© ముందడుగు. అనుమతి లేకుండా ఈ కథనాన్ని పునఃప్రచురించరాదు.
కామెంట్లు (0)
కామెంట్ చేయడానికి లాగిన్ అవ్వండి
లాగిన్ఇంకా కామెంట్లు లేవు. మొదటి వ్యాఖ్య మీరే రాయండి!